ధనవంతులు కావాలంటే రావి చెట్టు వద్ద ఇలా చేయండి..?

ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తం డబ్బు మీద ఆధారపడింది. మానవుడు తన జీవన ప్రయాణాన్ని కొనసాగించడానికి డబ్బు తప్పనిసరి అయ్యింది. అందువల్ల ప్రజలు నిత్యం డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయత్నాల వల్ల కొందరు తొందరగా ధనవంతులైతే మరికొందరు మాత్రం పేదరికం అనుభవిస్తూ ఉంటారు. సంపాదించిన డబ్బు మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చయిపోయి నిత్యం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వివిధ రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. పేదరికం తొలగిపోయి ధనవంతులు కావాలంటే రావి చెట్టు వద్ద ఇలా చేయాలని పండితులు చెబుతున్నారు.

పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే ఇంట్లో పూజ గదిలో ఒక చెంబులో గంగాజలాన్ని ఉంచి అలాగే ఇంట్లో ఈశాన్యమూలన తులసి మొక్కను పూజించాలి. అలాగే లక్ష్మీదేవీ (ఇరువైపులా దిగ్గజాలు అంటే ఏనుగులు ఉన్న) ఫొటో పెట్టుకోండి. ఇక వ్యాపార సంస్థలు, దుకాణాలలో లక్ష్మీదేవి నిలుచున్న ఫొటోను పెట్టుకోవాలి. లక్ష్మీ దేవీ స్థిరంగా ఉండాలంటే లక్ష్మీపతి వెంట ఉంటే తప్పక ఆమె అక్కడ స్థిరంగా ఉంటుంది. అంటే నారాయణుడు (విష్ణువు) ఎక్కడ ఉంటే లక్ష్మీ అక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి నారాయణుడిని అనుగ్రహం పొందటానికి పూజలు చేయాలి.

అలాగే శ్రీనివాసుడిని సంబంధించిన జపాన్ని ప్రతిరోజు కొంత సేపు నిష్ఠతో పఠించడం లేదా ధ్యానం చేయడం వల్ల కొంత కాలానికి దాని ప్రభావం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అవకాశం ఉన్నవారు శనివారం, మంగళవారం రావిచెట్టుకు పాలు, నీళ్లు, బెల్లం కలిపి పోసి ప్రార్థన చేయాలి. రావిచెట్టును అశ్వత్థ వృక్షం అంటారు. సాక్షాత్ విష్ణుస్వరూపంగా భావించే రావిచెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అందువ‌ల్ల పైన తెలిపిన విధంగా చేస్తే.. త‌ప్ప‌క ల‌క్ష్మీ అనుగ్రహం పొంద‌వ‌చ్చు. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తి అయ్యి ధ‌నం బాగా సంపాదిస్తారు. సంప‌ద‌కు లోటు లేకుండా ఉంటుంది.