మొలకెత్తిన పల్లీలను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

సాధారణంగా వేరుసెనగ పల్లీలను తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. వీటిని చాలామంది కాల్చితినిగా మరికొందరు ఉడకపెట్టి తింటారు. ఇందులో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.
విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఖనిజ లవణాలతో పాటు అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా పల్లీల్లో లభించడం వల్ల వీటిని రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పాలి.

పల్లీల్లో అత్యధిక ప్రోటీన్ లతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, ఈ సమృద్ధిగా లభిస్తాయి. పల్లీలను వేయించుకొని తినడం కన్నా మొలకెత్తిన పల్లీలను ఆహారంగా తీసుకుంటే అధిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అనేక సర్వేలో స్పష్టమైంది. మొలకెత్తిన పల్లీలను ఆహారంగా తీసుకున్నప్పుడు వీటిలో సమృద్ధిగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్, సహజ ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంతోపాటు గుండె పనితీరును, రక్త ప్రసరణ వ్యవస్థను, నాడీ కణ వ్యవస్థను, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని విటమిన్ ఈ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.కరెక్ట్ అయిన సమస్యతో బాధపడేవారు వేరుశెనగపల్లి లతో పాటు కాస్త బెల్లం కలిపి తినడం వల్ల రక్తహీన సమస్యకు పెట్టవచ్చు. ఇక ఇలా వేరుశెనగ పల్లెలతో తయారు చేసిన చిక్కి చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు తినటం వల్ల వీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. పల్లీలు, బెల్లాన్ని కలిపి తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. .