ఈ కలుపు మొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

సాధారణంగా పల్లె వాతావరణంలో ఎక్కువగా కనిపించే ఉత్తరేణి మొక్కలను కలుపు మొక్కలుగా భావిస్తుంటారు.అయితే వీటి ఆరోగ్య ప్రయోజనాలను తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. భారతీయ ఆయుర్వేద వైద్యంలో ఉత్తరేణి మొక్కలకు ప్రముఖ స్థానం ఇవ్వబడింది. ఉత్తరేణి మొక్క ఆకులు, కాండం, వేర్లలో ఎన్నో ఔషధ గుణాలు ఎన్నో మొండి వ్యాధులను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఉత్తరేణి మొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజుకి పల్లెల్లో చాలామంది ఉత్తరేణి మొక్క కాండం ఉపయోగించి దంతాలను శుభ్రం చేసుకుంటుంటారు. కారణం ఈ మొక్కలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నోట్లో ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపజేసి దంతాలు మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు నోట్లో పుండ్లు, చిగుళ్లలో రక్తం కారడం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఉబ్బసం వ్యాధితో బాధపడేవారు ఉత్తరేణి గింజలను మరియు మిరియాలను మెత్తటి చూర్ణంగా చేసి చిటికెడు పరిమాణంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పొట్ట భాగంలో కొవ్వు, బాన పొట్ట సమస్యతో బాధపడేవారు ఉత్తరేణి మొక్క రసంతో నువ్వుల నూనె కలిపి చిన్న మంటపై వేడి చేసి నీరంతా ఆవిరైన తర్వాత మిగిలిన నూనెను పొట్ట భాగంలో మర్దన చేసుకుంటే అంటే ఫలితం దక్కుతుంది.

చలి జ్వరంతో బాధపడేవారు ఉత్తరేణి మొక్క వేర్ల మరియు కుప్పింట చెట్టు వేర్లు సేకరించి మెత్తటి చూర్ణంగా తయారు చేసి ఒక బట్టలో ఉంచి అప్పుడప్పుడు వాసన చూస్తుంటే తక్షణ ఉపశమనం పొందవచ్చు. బలహీనంగా ఉన్నవారు ఉత్తరేణి ఆకుల కషాయాన్ని సేవిస్తే బలిష్టంగా, దృఢంగా తయారవుతారు.దీనికోసం ఉత్తరేణి ఆకులు, మిరియాలు, సహదేవి చెట్టు బెరడు సేకరించి వీటన్నిటిని మెత్తటి చూర్ణంగా చేసుకొని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని మింగితే మంచి ఫలితం ఉంటుంది. ఉత్తరేణి ఆకుల రసాన్ని ఆవు నెయ్యి కలిపి తీసుకుంటే రక్త మొలల సమస్య తగ్గుతుంది.
ఈ చిట్కాలన్ని పాటించే ముందు ఒకసారి వైద్య సలహాలు తీసుకోవడం మంచిది.