మేక పాలు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మనందరికీ ఉదయాన్నే కాఫీ,టీ, పాలు తాగే అలవాటు కచ్చితంగా ఉంటుంది. అయితే రోజూ మనం తాగే ఆవుపాలు, గేదెపాల కంటే మేక పాలల్లోనే అధిక మొత్తంలో విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ , విటమిన్ డి, కాల్షియం లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన పూర్వీకులు కూడా మేక పాలు ఆరోగ్యానికి శ్రేష్ఠం అని ఎప్పుడూ చెప్పేవారు ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో కచ్చితంగా ప్రతి ఇంట్లో మేకలు ఉండేటివి కాబట్టి మేకపాలు సమృద్ధిగా లభించేవి ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు కొన్ని కంపెనీలు మేకపాలను సేకరించి ప్రత్యేక ప్యాకెట్ రూపంలో అమ్మడం జరుగుతోంది. మేక పాలు కొందరిలో అలర్జీలకు కారణం కావచ్చు ఇలాంటివారు వైద్య సలహాలు తీసుకోవడం మంచిది.

ప్రస్తుత రోజుల్లో మేకపాలు కొంత ఖరీదు అయినప్పటికీ చాలామంది వీటిని తాగడానికి ఇష్టపడుతున్నారు. ప్రతిరోజు మేకపాలను సేవిస్తే వీటిలో పుష్కలంగా లభించే విటమిన్స్, కొవ్వు ఆమ్లాలతో పాటు, సెలెనియం అనే పదార్థం శరీరాన్ని దృఢంగా ఉంచి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించి భవిష్యత్తులో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లను నియంత్రిస్తుంది. మేక పాలలో క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ ఈ, పొటాషియం, సమృద్ధిగా లభిస్తాయి కావున చిన్నపిల్లల మానసిక శారీరక పెరుగుదలకు తోడ్పడి మెదడును చురుగ్గా ఉంచడంతోపాటు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.

గేదె, ఆవు పాలలో ఉండే కొవ్వు పదార్థాల కంటే మేక పాలలో ఉండే ఫ్యాట్ మొలిక్యూల్స్ తేలికగా జీర్ణం అవుతుంది. తద్వారా మేక పాలలో ఉండే సంపూర్ణ పోషకాలు మన శరీరం సులువుగా గ్రహిస్తాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. మేక పాలల్లో అత్యధికంగా కాల్షియం లభిస్తుంది. కావున ఎముకలు దంతాలు దృఢంగా ఉండి వృద్ధాప్యంలో వచ్చే ఆస్తియోఫోరోసిస్ ఆర్థరైటిస్ వంటి సమస్యలను అధిగమించవచ్చు.

రక్తహీనత సమస్యతో బాధపడేవారు మేకపాలను తాగితే వీటిలో పుష్కలంగా ఉన్న ఐరన్, పోలిక్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి ప్రమాదకర అనీమియా సమస్యను దూరం చేస్తుంది.మేక పాలను స్కిన్ కేర్ ఉత్పత్తిలో, బ్యూటీ సోప్, లోషన్స్ లో ఎక్కువగా వాడుతున్నారు కారణం వీటిలో అత్యధికంగా ఉండే విటమిన్ ఈ,యాంటీ మైక్రోబియన్ గుణాలు చర్మంపై వచ్చే అనేక ఇన్ఫెక్షన్లను, మచ్చలను, మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా ఉంచడంలో చక్కగా ఉపయోగపడతాయి