కొత్తిమీరను ఈ విధంగా ఉపయోగిస్తే…. సకల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు!

మన రోజువారి ఆహారంలో కొత్తిమీరను కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తామని చాలామంది భావిస్తుంటారు. అయితే కొత్తిమీరలో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన ఔషధ గుణాలు మరియు పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయని చాలామందికి తెలియకపోవచ్చు. కొత్తిమీరలో యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్ గుణాలతో పాటు మన శరీర పోషణకు అవసరమైన ప్రోటీన్, ఖనిజ లవణాలు ,ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి.

కొత్తిమీరను రోజువారి ఆహారంలో తీసుకోవడంతో పాటు ప్రతిరోజు అల్పాహారం తర్వాత కొత్తిమీర రసాన్ని సేవిస్తే అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తిమీర రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే శరీరంలోని విష పదార్థాలు తొలగిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తద్వారా మనం తీసుకునే ఆహారంలోని పోషక విలువలు మనం సమృద్ధిగా గ్రహించవచ్చు. కొత్తిమీర లోని సహజ యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది కావున ప్రతిరోజు కొత్తిమీర రసాన్ని సేవిస్తే శరీర బరువును సులువుగా తగ్గించుకోవచ్చు.

కొత్తిమీరలో సమృద్ధిగా లభించే పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను బలోపేతం చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా గుండెపోటు ముప్పును కూడా తగ్గిస్తుంది. తరచూ కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారు కొత్తిమీర రసాన్ని సేవిస్తూ ఇందులో సమృద్ధిగా లభించే కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఖనిజలవనాలు ఎముకల దృఢత్వానికి తోడ్పడి కీళ్ల నొప్పుల సమస్యను దూరం చేస్తాయి. మెగ్నీషియం నాడీ కణ వ్యవస్థను అభివృద్ధి పరిచి మెదడు చురుకుదనాన్ని జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.కొత్తిమీరలోని యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడి డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయడంలో సహాయపడుతుంది.