తులసి పాలు తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఆ సమస్యలకు చెక్ అంటూ?

మనలో చాలామంది ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండటంతో పాటు తీసుకునే పాల విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తులసి పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. తులసి మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం.

ఆయుర్వేద ఔషధాల తయారీలో సైతం తులసి పాలను వినియోగించడం జరుగుతుంది. తులసి, పాలు రెండూ కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు దూరమవుతాయి. డిప్రెషన్ లాంటి సమస్యలతో బాధ పడేవాళ్లు తులసి ఆకులను మరిగించి తాగడం వల్ల ఆ సమస్యలకు కూడా సులువుగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇమ్యూనిటీ పవర్ ను పెంచ్దంలో తులసి పాలు తోడ్పడతాయి.

యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న తులసి పాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు తులసి పాలు తాగడం వల్ల ఆ సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యలు, కిడ్నీలో రాళ్ల సమస్యలకు తులసి పాలు చెక్ పెడతాయి. ప్రతిరోజూ ఒక గ్లాస్ తులసి పాలు తాగడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

అంటువ్యాధుల ముప్పును తగ్గించడంలో కూడా తులసి పాలు తోడ్పడతాయి. ఆందోళన, ఒత్తిడిని వేగంగా తగ్గించడంలో తులసి పాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఒకటిన్నర గ్లాసు పాలలో తులసి ఆకులను ఉడికించడం ద్వారా తులసి పాలను సులువుగా తయారు చేయవచ్చు.