మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో త్రిఫల చూర్ణం తీసుకొంటూ ఉంటారు. ఆయుర్వేదంలోని పురాతన, చాలా ప్రభావవంతమైన ఔషధం త్రిఫల కాగా ఉసిరి, కరక్కాయ, తానికాయ మందులతో త్రిఫల చూర్ణం తయారు చేయడం జరుగుతుంది. నయం చేయలేని వ్యాధులను నయం చేయడానికి త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వాత, పిత్త మరియు కఫా దోషాలకు చెక్ పెట్టడంలో త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది.
త్రిఫల తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పవచ్చు. అలెర్జీలు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో త్రిఫల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. త్రిఫల ఫలం తీసుకోవడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గ్యాస్, అజీర్ణం, పుల్లని త్రేనుపు, అపానవాయువు మొదలైన జీర్ణ సమస్యలను త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేయడంలో త్రిఫల చూర్ణం తోడ్పడుతుంది.
చర్మంలో మెరుపును పెంచడంలో, యవ్వనంగా ఉంచడంలో కూడా త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది. ముడతలు, మచ్చల సమస్యలకు త్రిఫల చూర్ణం సులభంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. కళ్ళు ఆరోగ్యంగా, దృష్టిని సరిగ్గా ఉంచడానికి, త్రిఫల పొడిని ఒక గ్లాసు నీటిలో 10 నిమిషాలు మరిగించి ఈ నీళ్లతో కళ్లను కడిగితే కంటి సంబంధిత సమస్యలను దూరం చేయవచ్చు.
త్రిఫల చూర్ణాన్ని ఆవు నెయ్యి తేనెతో కలిపి తీసుకుంటే కంటి కణజాలం, నరాలు బలపడే అవకాశాలు అయితే ఉంటాయి. త్రిఫల చూర్ణం తరచూ తీసుకుంటే శరీరం ఉత్తేజంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లను కరిగించడంతో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో త్రిఫల చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.