Antibodies: కరోనా వేళ.. శరీరంలో యాంటీబాడీస్ పెరగాలా..? ఇవి పాటిస్తే మేలు..!!

Antibodies: కరోనా వైరస్ సృష్టిస్తున్న అల్లకల్లోలం మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎవరిపై వైరస్ అటాక్ చేస్తుందో తెలీదు. ఈనేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకుంటే మన శరీరంలో యాంటీబాడీలు పెరిగి వైరస్ తో పోరాడతాయి. అయితే.. వ్యాక్సినేషన్ తర్వాత మనలో యాంటీ బాడీలు ఎన్నాళ్లుంటాయనే దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. కాబట్టి.. వ్యాక్సినేషన్ తో కాకుండా మనమే యాంటీబాడీలను పెంచుకోవచ్చు.


మన శరీరంలో యాంటీబాడీస్ ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తినడంతోనే పెరుగుతాయి. మాంసం, చికెన్, గుడ్లుతోపాటు జీడిపప్పు, బాదం పప్పుల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్ కదా అని మరీ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది కూడా. కాబట్టి.. మితంగా తింటూండాలి. విటమిన్ A, C, E ఉండే పండ్లు ఎక్కువగా తినాలి. పుల్లగా ఉండే పండ్లలో యాంటీబాడీస్ బాగా పెరుగుతాయి. కమలాలు, బత్తాయిలు, ద్రాక్ష, పుచ్చకాయ, బొప్పాయి, బ్రకోలీ, టమాటాలు, నిమ్మకాయల్లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

ప్రతిరోజూ శారీరక వ్యాయామం తప్పనిసరి. కనీసం 10 నిముషాలైనా నడవాలి. ఒళ్లు కదలాలి.. అంటే శారీరక శ్రమ ఉండేలా మెట్లు ఎక్కి దిగడం, కొద్దిగా బరువైన వస్తువుల్ని మోయడం చేయాలి. ఇల్లు ఊడ్చడం, మొక్కలకు నీళ్లు పొయ్యడం కూడా శారీరక శ్రమే. గంటలతరబడి ఎక్సర్‌సైజ్‌లు అవసరంలేదు. ఈ సమయంలో ఒత్తిడికి గురవడం కరెక్ట్ కాదు. పాజిటివ్ మైండ్ తో ఉండాలి. యోగా, ధ్యానం చేయాలి. పెంపుడు జంతువులతో ఆడుకోండి. మనసుకు ఉల్లాసం అనిపించే సినిమాలు, నవ్వు తెప్పించే కామెడీ సన్నివేశాలు చూడండి. ఇష్టమైన వ్యాపకం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడటం కూడా మంచిది.

ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్స్‌తో వంటలు చేసుకోవడం ఉత్తమం. వేపుళ్లు తగ్గించి ఉడకబెట్టిన ఆహారం, పులుసు వంటలు తినాలి. మొలకలు తినాలి. మసాలాలు తగ్గించాలి. బాడీలో కొవ్వు లేకుండా చూసుకుంటే యాంటీబాడీస్ పెరుగుదల బాగుంటుంది. మద్యానికి దూరంగా ఉండాలి. యాంటీబాడీస్ పెరుగుదలను మద్యం అడ్డుకుంటుంది. విటమిన్ డి.. మన శరీరానికి ఎంతో ముఖ్యం. ఇది సాయంత్రం వేళ ఎండ ద్వారా లభిస్తుంది. అవకాశం లేకపోతే డాక్టర్ల సూచనలతో విటమిన్ డి టాబ్లెట్లు వేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆహార నియమాల్ని పాటించి ముందు మనం శక్తివంతంగా తయారవడం ఎంతైనా అవసరం.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.