Lunch: ప్రస్తుత రోజుల్లో మన జీవనశైలి మాత్రమే కాదు ఆహారశైలి కూడా మారిపోయింది. పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్ధిక పరిస్థితి, కుటుంబ సమస్యలు.. మనిషి లైఫ్ కంట్రోల్ లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ఇందుకు డాక్టర్లు, ఆహార నిపుణులు చాలా చిట్కాలు, జాగ్రత్తలు చెప్తూంటారు. అందులో ఒకటి మధ్యాహ్న భోజనం తర్వాత తినకూడనివి, చేయకూడనివి. అవి మన ఆరోగ్యంపై చూపే ప్రభావాలు కూడా. అవేమిటో చూస్తే..
మధ్యాహ్నం భోజనం కాగానే అందరూ ఆహారం జీర్ణం అవుతుందనే భావనలో నడవటం, మెట్లు ఎక్కడం దిగటం చేస్తూంటారు. కానీ.. అవి మంచిది కావు. పెద్దవారు, ఊబకాయం ఉన్నవారు ఇలా ఎక్కువగా చేస్తూంటారు. భోజనం అయ్యాక ఇంటి ఆవరణలోనే నాలుగు అడుగులు అటు ఇటూ వేయడం సరైనదే కానీ.. ఇలా ఎక్కువ దూరం నడవడం, ఆయాసపడుతూ మెట్లెక్కడం చేయడం మంచిది కాదంటున్నారు.
భోజనం చేశాక అరగంటకే టీ, కాఫీలు తాగేస్తారు కొందరు. భోజనం చేసాక రెండు గంటల తర్వాతనే టీ, కాఫీ.. మంచినీళ్లు ఎక్కువగా తాగడమైనా చేయాలని డాక్టర్లు చెప్తారు. రెండు, రెండున్నరు భోజనం చేసి ఆ వెంటనే మూడు. . మూడున్నర, నాలుగు అయిన వెంటనే టీ టైమ్ అని తాగకూడదని అంటున్నారు.. ఇది జీర్ణక్రియపై ఎఫెక్ట్ చూపుతుందని అంటున్నారు.
భోజనం చేశాక ఫ్రూట్స్ తినడం మంచిదని కొందరు తింటూంటారు. కానీ.. ఆ పద్ధతి కూడా మంచిది కాదంటున్నారు. కనీసం గంట తర్వాతే ఏదైనా పండు తినడం చేయాలంటున్నారు. తిన్న వెంటనే నిద్ర పోవడం, స్నానం చేయడం, కూర్చోవడం.. కూడా కరెక్ట్ కాదంటున్నారు. భోజనం వెంటనే నిద్రపోతే బరువు పెరుగుతారు. వెంటనే స్నానం చేయడం వల్ల కూడా జీర్ణక్రియపై ప్రభావం చూపడంతోపాటు అసిడిటీ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.
రాత్రిపూట అన్నం తక్కువ తింటారు కొందరు.. మరికొందరు టిఫిన్స్ చేస్తారు. కాబట్టి ఎలా తిన్నా మధ్యాహ్న భోజనంలోనే కావాల్సినవి, ఇష్టమైనవాటిని తినేందుకు అవకాశం ఎక్కువ. అప్పుడైనా మితంగా తిని భోజనం చేశాక పైన చెప్పినవి చేయకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటామనేది నిపుణుల మాట.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.