శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచే పదార్థాలు ఇవే.. వీటిని తింటే మాత్రం ప్రాణాలకు ప్రమాదమే!

23_01_2023-reduce_bad_cholesterol

మనలో చాలామంది కొన్ని పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటారు. రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకే లభిస్తూ ఉండటంతో కొన్ని ఆహార పదార్థాలపై మనకు ఇష్టం పెరుగుతుంది. ప్రస్తుతం కొత్తకొత్త రోగాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని అహారాలు శరీరానికి చేస్తున్న హాని అంతాఇంతా కాదు. ఆ ఆహారాలు తినడం వల్ల శరీరానికి లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

 

మనలో చాలామంది కూల్ డ్రింక్స్ ను ఇష్టంగా తాగుతారు. పదేపదే తాగాలని అనిపించే గుణాలు కూల్ డ్రింక్స్ లో ఉంటాయి కాబట్టి కొంతమంది ఇష్టానుసారం కూల్ డ్రింక్స్ ను తాగుతారు. అయితే కూల్ డ్రింక్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, డిప్రెషన్, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

 

పదేపదే కూల్ డ్రింక్స్ తాగేవాళ్లలో చక్కెర శాతం పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కూల్ డ్రింక్స్ కు వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి ఎంతగానో మేలు కలుగుతుందని చెప్పవచ్చు. జున్ను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. మార్కెట్ లో దొరికే జున్నులో ఎక్కువ్ మొత్తం కల్తీ జున్ను కావడం గమనార్హం. కల్తీ జున్నును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

 

మనలో కొంతమంది పిజ్జాలు, శాండ్ విచ్ లు, బర్గర్లను, ఫ్రెంచ్ ఫ్రైలను తెగ ఇష్టంగా తినేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే వీటిని ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యానికి కలిగే నష్టం అంతాఇంతా కాదు. కొలెస్ట్రాల్ ను పెంచే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఆహార పదార్థాల వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.