ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో ఆస్తమా ఒకటి. ఆస్తమా లక్షణాలను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, ఔషధాలను తీసుకోవడంతో పాటు ఈ సమస్య రావడానికి గల కారణాలను గుర్తించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయని కచ్చితంగా చెప్పవచ్చు.
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఉబ్బసం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అలెర్జీ నిపుణుడు సూచించిన ఆస్తమా మందులు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. దగ్గు దాడుల నుండి ఉపశమనం పొందడానికి బ్రోంకోడైలేటర్ ఇన్హేలర్‌ను ఉపయోగించడం ద్వారా మేలు జరుగుతుంది.
మంట నుండి ఉపశమనం పొందడానికి కార్టికోస్టెరాయిడ్ ఇన్హేలర్‌ను వాడాల్సి ఉంటుంది. ఆస్తమా దాడి సమయంలో సులభంగా శ్వాస తీసుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాలి. ఆస్తమా బాగా నియంత్రణలో ఉన్నప్పుడు, మీకు తక్కువ లక్షణాలు కనిపించే అవకాశాలు ఉంటాయి. చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి వల్ల ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది.
ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో ఎక్కువమంది శీతల పానీయాలను తాగుతూ ఉంటారు. శీతల పానీయాలకు దూరంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆస్తమా ఉన్నవాళ్లు సిగరెట్లు, మందుకు దూరంగా ఉండాలి. ఆస్తమా వ్యాధిగ్రస్తులు కాఫీకి దూరంగా ఉంటే మంచిది.