వీళ్లు మటన్ తింటే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే.. వీళ్లకు మటన్ తో ఎంతో ప్రమాదం!

మనలో చాలామంది మటన్ ను ఎంతగానో ఇష్టపడతారు. మటన్‌ను సాధారణంగా ఒక సంవత్సరం కంటే పాత గొర్రెల నుంచి తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. మటన్‌లో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సరైన విధంగా పెంచని గొర్రెల నుంచి వచ్చే మటన్‌ను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అదే సమయంలో కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు మటన్ ను తినకూడదు.

మటన్ ను తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పరిమితిని మించి మటన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు. ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్లు మటన్ తినడం ద్వారా శరీరానికి అవసరమైన స్థాయిలో లభిస్తాయని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడే వాళ్లకు మటన్ ఏ మాత్రం శ్రేయస్కరం కాదని కచ్చితంగా చెప్పవచ్చు.

అనీమియా సమస్యతో బాధ పడేవాళ్లు మాత్రం మటన్ తీసుకుంటే ఆ సమస్య సులువుగానే దూరమవుతుంది. హై బీపీ సమస్యతో బాధ పడేవాళ్లకు సైతం మటన్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సైతం మటన్ ఆరోగ్యకరం కాదు. ఎముకల సమస్యలతో బాధ పడేవాళ్లకు సైతం మటన్ తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

మటన్ హార్ట్ ఎటాక్ రిస్క్ ను పెంచుతుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు. మటన్ ను పూర్తిగా ఉడికించుకుని మాత్రమే తినాలి. వారానికి రెండుసార్ల కంటే ఎక్కువసార్లు మటన్ తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని కచ్చితంగా చెప్పవచ్చు. అధిక కొవ్వుతో ఉన్న మటన్ ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు.