గుండెపోటు వచ్చే ముందు గుండె హెచ్చరించే లక్షణాలు ఇవే…. జర జాగ్రత్త!

Heart-Attack-blog

ఈ రోజుల్లో యుక్త వయసులోనే గుండె సంబంధిత జబ్బులతో డాక్టర్ల దగ్గరకు పరుగులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తీవ్రమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, రోజువారి ఆహారంలో అత్యధిక కేలరీలు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు కలిగిన ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వంటివి ఎక్కువగా తినడం వల్ల ఉబకాయ సమస్య తలెత్తి అనేక గుండె జబ్బులకు కారణం అవుతుంది. అయితే ఈ విధమైనటువంటి సమస్య రాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడవచ్చు.మన గుండెను పదికాలాలపాటు కాపాడుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉందని చెప్పాలి.

హఠాత్తుగా గుండెపోటు సమస్య తలెత్తినప్పుడు సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. సహజంగా గుండెపోటు రావడానికి ముందు మన గుండె కొన్ని హెచ్చరికలను జారీ చేస్తుంది ఇవి కనక గుర్తించినట్లయితే గుండెపోటు ప్రమాదాలను చాలా వరకు కట్టడి చేయవచ్చు. మరి గుండెపోటు రావడానికి ముందు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెపోటు రావడానికి ముందు అలసటగా ఉండి శరీరం మొత్తం చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, గుండె భాగంలో పట్టేసినట్టు ఉండి గుండె దడగా ఉండడం వంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి. ఒక్కొక్కసారి మాట తీరు స్పష్టంగా లేకపోవడం, తీవ్రమైన దగ్గు, గొంతు పట్టేసినట్టు అనిపించడం లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని గుండె వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది. గ్యాస్టిక్, ఎసిడిటీ సమస్యలు కూడా గుండె పోటుకు పరోక్ష కారణాలు అన్నది గుర్తుంచుకోవాలి.అయితే ఒకటి రెండు సార్లు ఇలా అనిపిస్తే దానిని ఏమాత్రం ఆ శ్రద్ధ చేయకూడదని ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మన గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.