ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయా.. ఈ క్రేజీ చిట్కాలతో ప్రయోజనాలు!

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో ఒత్తిడి, ఆందోళన సమస్య కూడా ఒకటి. ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక శ్రమ, విశ్రాంతి వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నిద్ర వంటివి ఎంతో ముఖ్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నడక, జాగింగ్, నృత్యం, ఈత వంటి కార్యకలాపాలు చేయడం ద్వారా ఒత్తిడిని కొంతమేర అధిగమించే ఛాన్స్ ఉంటుంది.

ధ్యానం, యోగా, లోతైన శ్వాస, మసాజ్ ద్వారా ఒత్తిడిని సులువుగా అధిగమించవచ్చు. ప్రకృతితో సమయం గడపడం ద్వారా కూడా ఒత్తిడి, ఆందోళన సమస్యలు సులువుగా దూరమవుతాయని చెప్పవచ్చు. మ్యూజిక్ ను ఆస్వాదించడం ద్వారా కూడా ఒత్తిడి దూరమయ్యే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంటుంది. పాజిటివ్ దృక్పథాన్ని అలవరచుకోవడం ద్వారా ఒత్తిడిని సులువుగా అధిగమించవచ్చు.

ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అవకాడో తినడం వల్ల మంచి ఫలితాలు ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్ బి సులువుగా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. బ్లూ బెర్రీస్ తినడం ద్వార కూడా ఒత్తిడి దూరమవుతుంది. బ్లూ బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రతిరోజూ పాలు, పెరుగు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభించి ఒత్తిడి తగ్గుతుంది. గుడ్డు సొన తీసుకోవడం ద్వారా విటమిన్ డి లభించడంతో పాటు డిప్రెషన్, ఆందోళన లక్షణాలు తగ్గుతాయని చెప్పవచ్చు. పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.