మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో నిద్రలేమి సమస్య వేధిస్తుంది. నిద్రలేమి సమస్య వల్ల ఇతర ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతిరోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిద్రలేమి సమస్యతో బాధ పడేవాళ్లను గుండె జబ్బులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వేధించే అవకాశం ఉంటుంది.
నిద్రలేమి వల్ల టైప్2 డయాబెటిస్ సమస్య వేధించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. నాణ్యమైన నిద్ర అలవాటు ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నిద్రలేమి సమస్యతో బాధ పడేవాళ్లు కెఫీన్ లేదా కార్బోనేటేడ్ పానీయాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. నిద్రపోయే సమయంలో ల్యాప్ టాప్, టీవీలు, మొబైల్ లకు వీలైనంత దూరంగా ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది.
ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు నిద్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నిద్రపోవడానికి ముందు పుస్తకాలు చదవడం ద్వారా ప్రశాంతంగా నిద్రపోయే అవకాశాలు అయితే ఉంటాయి. నిద్రపోయే సమయంలో చుట్టూ ప్రశాంతతకు భంగం కలిగించేవి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో మంచిదని చెప్పవచ్చు.
నిద్రపోవడానికి ముందు మజ్జిగ, నారింజ పండ్లు తీసుకోవడం ద్వారా త్వరగా నిద్ర పట్టే అవకాశాలు అయితే ఉంటాయి. మధ్యాహ్న సమయంలో నిద్రకు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు