పండ్లను తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే!

winter-fruits

మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించే అన్ని రకాల పోషక పదార్థాలు మరియు ఔషధ గుణాలు సీజనల్ గా లభించే అన్ని రకాల పండ్లలో సమృద్ధిగా లభిస్తాయి.అందుకే ప్రతిరోజు ఏదో ఒక పండును ఆహారంగా తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు చెబుతుంటారు అయితే చాలామంది పండ్లను తినేటప్పుడు పై తొక్కను తొలగించి తింటుంటారు. ఈ నియమం అన్ని రకాల పండ్లకు వర్తించదు అంటున్నారు నిపుణులు.

ఉదాహరణకు యాపిల్, జామ, అవకాడో,పియర్, ద్రాక్ష,రేగు వంటి కొన్ని రకాల పండ్ల తొక్క భాగంలో మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, రైబోఫ్లైవిన్, నికోటిన్ ఆమ్లం, పోలిక్ ఆమ్లం వంటి సూక్ష్మ పోషకాలు.పోటాషియం, మెగ్నీషియం,కాల్షియం, జింక్ , పాస్ఫరస్,ఐరన్ మాంగనీస్ వంటి స్థూల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కావున ఇలాంటి పనులను తొక్క తీసి తినడం కంటే అలాగే పూర్తి పండును తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పండ్లను తినేటప్పుడు శుభ్రంగా కడిగి తినడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే పండ్ల పై క్రిమిసంహారక మందులు, దుమ్ముదులి అవశేషాలు ఉండవచ్చు.

అరటిపండు, దానిమ్మ, బొప్పాయి, ఆరెంజ్, పుచ్చకాయ, కివి వంటి పండ్ల తొక్కలో కూడా చాలా పోషకాలు ఔషధ గుణాలు ఉంటాయి అయితే వీటి తొక్కలను మనం నేరుగా తినడం చాలా కష్టం. కావున వీటిని మరిగించి వీటి కషాయాన్ని సేవించవచ్చు. ముఖ్యంగా దానిమ్మ, ఆరెంజ్ తొక్కలతో రుచికరమైన పానీయాన్ని తయారు చేసుకొని సేవిస్తే ఉబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్, రక్త పోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు.