గుండె పదికాలాలపాటు భద్రంగా ఉండాలంటే ఆహారంలో ఇవి తప్పనిసరి!

World-heart-day-2021

మన శరీరంలో అవయవాలని సరైన క్రమంలో పని చేయడానికి ఎన్నో పోషక విలువలు ఎంతో అవసరం.ఈ క్రమంలోనే పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. మన నిత్య జీవక్రియలు సక్రమంగా జరగడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినైల్స్, కెరోటినాయిడ్స్ ప్రోటీన్స్,విటమిన్, పొటాషియం, పాస్ఫరస్, ఫైబర్, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా ఆరోగ్యవంతమైన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు. అయితే ప్రతిరోజు ఆహార పదార్థాలలో జీడిపప్పును తినడం వల్ల శరీర బరువు పెరిగి అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని చాలామంది జీడిపప్పును తినడం మానేస్తున్నారు.అది కొందరి అపోహ మాత్రమే

తాజా అధ్యయన ప్రకారం వారానికి ఒకటి లేదా రెండు సార్లు రెండు గుప్పిళ్లు జీడిపప్పులు తినేవారిలో గుండె జబ్బు ప్రమాదం 20 నుంచి 23శాతం తక్కువగా ఉంటుందని తేలింది. దీనికి కారణం జీడిపప్పులో అధికంగా ఉండే మెగ్నీషియం మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను సమర్ధవంతంగా కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇలా మన గుండె పది కాలాలపాటు భద్రంగా ఉండాలంటే ఆహారంలో జీడిపప్పు తప్పనిసరి.

గుండె పనితీరును దెబ్బతీసే సోడియం జీడిపప్పులో తక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచే పొటాషియం అధికంగా ఉంటుంది కావున రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి హై బీపీ, లోబీపీ వంటి సమస్యలు దరి చేరవు. అదేవిధంగా ఇందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను సక్రమంగా మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి శరీరంలో క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనడంలో కీలక పాత్ర పోషిస్తుంది. .