మనలో చాలామంది కలోంజి గింజల గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. కలోంజి గింజలు తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కొంతమంది ఈ గింజలను నిగెల్లా గింజలు అని కూడా పిలుస్తారు. మన దేశంలో చాలామంది ఈ గింజలను వంటకాలలో వినియోగిస్తారు. ఈ గింజలను వంటకాలలో వాడటం వల్ల వంటకాలు రుచిగా ఉంటాయని చెప్పవచ్చు.
ఈ గింజల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి. ఈ గింజలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు ముడి ఫైబర్, ఐరన్, సోడియం, పొటాషియం, కాల్షియం, లినోసిక్ యాసిడ్ లభిస్తాయి. ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తారు. ఈ గింజలు ఆరోగ్యంతో పాటు ఆందాన్ని పెంచడంలో కూడా సహాయపడతాయని చెప్పవచ్చు. ఈ గింజలు తీసుకోవడం ద్వారా సులువుగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పవచ్చు.
అల్సర్ సమస్యతో బాధ పడేవాళ్లు ఈ గింజలను తీసుకోవడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది. పొట్టలోని పుండ్ల సమస్యను దూరం చేయడంలో ఈ గింజలు ఉపయోగపడతాయి. ఈ గింజలను వాడటం వల్ల క్యాన్సర్ సమస్య కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాలేయం ఆరోగ్యం విషయంలో ఈ గింజలు ఉపయోగపడతాయి. ఈ గింజలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లు ఈ గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మధుమేహం సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఈ గింజల ద్వారా అధిక రక్తపోటు సమస్య కూడా సులువుగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఆస్తమా, అలర్జీ నివారణలో ఈ గింజలు ఉపయోగపడతాయి.