మనలో చాలామంది ఆరోగ్యమే మహాభాగ్యం అని భావిస్తూ ఉంటారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ పుష్టిగా ఉండటం ద్వారా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అందువల్ల చాలామంది తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీలో అద్భుత గుణాలు ఉండడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
అయితే గ్రీన్ టీ పరిమితంగా తీసుకుంటే మాత్రమే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు గ్రీన్ టీకి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ఈరోజుల్లో చాలామందిని ఊబకాయం సమస్య వేధిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలామంది గ్రీన్ టీపై డిపెండ్ అవుతారు. గ్రీన్ టీ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతామని చాలామంది ఫీలవుతారు.
అయితే ఎక్కువ కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తాగితే షుగర్ లెవెల్స్ సైతం అదుపులో ఉంటాయి. గ్రీన్ టీ ఎక్కువగా తాగితే కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి. గతంలో కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు గ్రీన్ టీకి పూర్తిస్థాయిలో దూరంగా ఉంటే మంచిది.
గ్రీన్ టీ తీసుకుంటే మితంగా తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గ్రీన్ టీని ఇష్టానుసారం తీసుకుంటే మాత్రం కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తె అవకాశాలు అయితే ఉంటాయి. గ్రీన్ టీ ఎక్కువగా తాగేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి