తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారా.. తక్షణ ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి?

సహజంగా వృద్ధాప్యంలో వచ్చే వెన్నునొప్పి , నడుము నొప్పి వంటి సమస్యలు ఈ రోజుల్లో అతి చిన్న వయసులోనే సర్వసాధారణంగా మారాయి. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో కాల్షియం, ఐరన్, విటమిన్ డి వంటి పోషకాలు లోపించడం. ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, రుమటాయిడ్ , ఆర్థరైటిస్, ఆస్థియోఫోరోసిస్ వంటి కీళ్ల సంబంధిత జబ్బులతో బాధపడే వారిలో, మహిళల్లో ఎక్కువగా గర్భాశయ సమస్యలు రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి సమస్యల వల్ల ఎక్కువమంది వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు

వెన్నునొప్పి సమస్యను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పమంటున్నారు వైద్యులు. కావున తక్షణమే వైద్య నిపుణులు సంప్రదించి వైద్య సలహాలు తీసుకోవడం మరవద్దు. వెన్నునొప్ప బాధ నుంచి తక్షణం ఉపశమనం పొందడానికి మన ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించవచ్చు అవేంటో చూద్దాం.ఆఫీసులో గాని ఇంట్లో గాని కూర్చున్నప్పుడు సరైన భంగిమలో వెన్నెముక మీద పూర్తి బరువు ఉంచకుండా నిటారుగా కూర్చోండి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటే వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి గంటకు ఒకసారి లేచి అటు ఇటు తిరిగి మళ్లీ కూర్చొని పని చేసుకోవచ్చు. వీలైతే వెన్నెముకకు పూర్తిగా రిలాక్స్ అయ్యేవిధంగా కాసేపు పడుకోవడం మంచిది.

వెన్ను నొప్పి సమస్యతో బాధపడేవారు అధిక బరువులు ఎత్తడం మంచిది కాదు. ఒకవేళ బరువు ఎత్తాల్సి వస్తే బరువు మొత్తం వెన్నెముక మీద పడేలాగా కూర్చొని బరువు ఎత్తడం మంచిది కాదు. నిద్రించేటప్పుడు కాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకుంటే వెన్నునొప్పి బాధ నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి నీకు ఇష్టమైన పనులు చేయడంతో పాటు కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడకా వంటివి అలవాటు చేసుకోవాలి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ డి సమృద్ధిగా ఉన్న పాలు, గుడ్లు ,పండ్లు, చేపలు డ్రై ఫ్రూట్స్ వంటివి మన ఆహారంలో కచ్చితంగా ఉండునట్లు చూసుకోవాలి.