నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా.. లవంగాలను ఇలా ఉపయోగించండి!

ప్రతిరోజు మన వంటలో వాడే మసాలా దినుసులలో లవంగాలు కూడా ఉంటాయి. లవంగాలు రుచికి కారం అనిపించినా లవంగాలు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాలు వేసి వంట చేయడం ద్వారా ఆ వంట రుచి అద్భుతంగా ఉంటుంది. అలాంటి లవంగాల వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

లవంగాల పువ్వులని కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. ఈ పువ్వుల వల్ల మన పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. దంత సమస్యలతో బాధపడేవారు ఒకటి లేదా రెండు లవంగాలను నమిలి ఆ పంటి కింద పెట్టుకోవడం వల్ల కొద్దిసేపట్లో నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. టూత్ పేస్ట్ తయారీలో కూడా లవంగాలను ఎక్కువగా వాడుతారు.ఆహారం వల్లగానీ, శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. దాన్ని వెంటనే నివారించాలంటే మూడు లేదా నాలుగు లవంగాలు నోట్లో వేసుకొని మెల్లగా నములుతూ ఉంటే తాజా శ్వాస వచ్చి… నోటి దుర్వాసన పోతుంది.

షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు రెండు లవంగాలను నమిలి తినటం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. శీతాకాలంలో లవంగాల వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాలలోని యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు లవంగాలను తినటం లేదా లవంగాలు నానబెట్టుకుని మరుసటి ఉదయం ఆ నీటిని తాగటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.