Health Tips: నిద్రలో కండరాల నొప్పి వేధిస్తోందా… ఈ సమస్య ఉన్నట్లే?

Health Tips: సాధారణంగా మనం రోజంతా ఎంతో కష్టపడి పని చేసి ఎంతో అలసిపోయి నిద్రపోతాము ఇలా నిద్రపోయినప్పుడు కొన్నిసార్లు మన శరీరంలోని కండరాలు మొత్తం నొప్పి కలిగిస్తూ పట్టేసినట్లు ఉంటాయి. ఇలా రోజంతా పనిచేసే అలసిపోవటం వల్ల ఇలా జరుగుతుందని చాలామంది భావిస్తారు. అయితే మరి కొంత మంది ఎలాంటి పనులు చేయకపోయినా కండరాల నొప్పి తీవ్రమైన బాధను కలిగిస్తూ ఉంటుంది. ఇలా రాత్రిపూట నిద్రలో కండరాలు కనుక నొప్పిని కలిగిస్తున్నాయి అంటే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడైతే మన శరీరంలో పోషక విలువల స్థాయి తగ్గిపోయి ఉంటుందో అప్పటినుంచి కండరాల నొప్పి మొదలవుతుంది. ఇలా కండరాలు ఎక్కువగా నొప్పిని కలిగిస్తున్నాయి అంటే శరీరంలో క్యాల్షియం వంటి లవణాల లోపం వల్ల కండరాల తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరంలో ఈ పోషకాల విలువ తగ్గిపోయి ఉంటుందో ఆ క్షణం నుంచి కండరాలు లాగడం రక్త ప్రసరణ వ్యవస్థలు ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి.

ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మన శరీరానికి లవణాలు ఎక్కువగా అందించాలి మనం ఆకుకూరలను అధికంగా తీసుకోవడం వల్ల ఆకుకూరలలో అత్యధికమైనటువంటి పోషక విలువలు ఉంటాయి. ఇలా ఆకుకూరలను పది రోజులపాటు క్రమంగా తీసుకోవడం వల్ల ఈ నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. ఆకుకూరలలో కాల్షియం మాంగనీస్ పొటాషియం ఫైబర్ విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి కనుక ఆకకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఆకుకూరలతో పాటు నువ్వులను కూడా అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నువ్వుల్లో మంచి పోషకాలు ఉంటాయి. అదే విధంగా మెండుగా క్యాల్షియం ఉంటుంది. దీంతో కండరాల తిమ్మిర్ల నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీరు తాగడం వల్ల కూడా మంచి ఉపశమనం పొందుతారు. ఈ నీటిలో సోడియం ఎక్కువగా ఉండటంవల్ల కండరాల తిమ్మిరి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూనే మరోవైపు సరైన వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.