మోషన్స్ సమస్యతో బాధ పడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

Bloating-and-Burning-in-the-Stomach

మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో వేధించే ఆరోగ్య సమస్యలలో లూజ్ మోషన్స్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య చిన్న సమస్యలానే అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. డయేరియా లేదా లూజ్ మోషన్స్ సమస్య ఎదురైతే నిత్యం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ సమస్య వల్ల డీ హైడ్రేషన్ సమస్య కూడా వేధిస్తోంది. అరటిపండ్లు తినడం వల్ల ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు.

అరటిపండులో ఉండే ఫైబర్ ఈ సమస్యను సులువుగా దూరం చేస్తుంది. పెరుగు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోబయాటిక్ బ్యాక్టీరియా లభిస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు సులువుగా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. యాపిల్స్ తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. యాపిల్స్ తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ఓట్మీల్ తినడం వల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. బీన్స్, కీరా, క్యారెట్ తో కలిపి ఓట్స్ తీసుకుంటే మోషన్స్ సమస్య దూరమవుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా కూడా మోషన్స్ సమస్యను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జీలకర్ర నీరు తాగడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. లూజ్ మోషన్స్ సమస్య దూరమవుతుంది.

జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో మజ్జిగ కూడా ఉపయోగపడుతుంది. మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. తేనెతో మునగాకు రసం కలిపి తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పెసర పప్పు తో చేసే కిచిడీ తినడం వల్ల కూడా జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.