మన భారతదేశంలో వంటింట్లో ఉండే అనేక రకాల మసాలా దినుసులు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మన వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో ఇంగువ కూడా ఒకటి. కూరలలో ఇంగువ వేసి ఉండటం వల్ల వాటి రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా మనం రోజు తీసుకునే ఆహారంలో ఇంగువ తీసుకోవటం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంగువని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంగువ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనం తీసుకునే ఆహారంతో ఇంగువ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో కీలకంగా పనిచేస్తుంది. ఇంగువ మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం, అజీర్తి, ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణాశయంలోని విష పదార్థాలను తొలగించడంలో ఇంగువ ఎంతో ఉపయోగపడుతుంది.
ఇంగువలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో జీవ సంబంధిత వ్యాధులను నిర్మూలించడమే కాకుండా అధిక రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది. మనం తీసుకునే రోజు వారి ఆహారంలో ఇంగువ చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి అధిక బరువు సమస్య నుండి విముక్తి కలిగిస్తుంది.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ప్రతిరోజు ఇంగువ కలిపి తాగటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఇంగువను ఎక్కువగా వివిధ రకాల ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఆరోగ్యానికి మంచిదనీ అధిక మోతాదులో ఇంగువ తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. నాడీ సంబంధిత వ్యాధులు గర్భంతో ఉన్న మహిళలు ఇంగువ తీసుకోవటం వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అటువంటివారు ఇంగువకి దూరంగా ఉండటం మంచిది. గర్భిణీ స్త్రీలు ఇంగువ తీసుకోవటం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.