ఉదయాన్నే టిఫిన్ తినడం మానేస్తున్నారా? ఇక త్వరలో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే!

ఈ రోజుల్లో చాలామంది రకరకాల కారణాలతో ఉదయాన్నే టిఫిన్ తినడం మానేస్తుంటారు. ముఖ్యంగా శరీర బరువు పెరుగుతుందన్న ఉద్దేశంతో ఉదయాన్నే అల్పాహారాన్ని తినడం మానేసేవారు కొందరైతే,మరికొందరు బిజీ లైఫ్ కారణంగా అల్పాహారాన్ని తినడం కుదరక మానేస్తుంటారు. కారణాలు ఏవైనా ఉదయాన్నే అల్పాహారాన్ని సమయానికి తినని వారిలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఉదయాన్నే అల్పాహారాన్ని సమయానికి తినకపోతే మన శరీర జీవక్రియల్లో వ్యత్యాసం ఏర్పడి అవయవాల పనితీరు మందగిస్తుంది ఫలితంగా తీవ్రమైన తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి లక్షణాలు మిమ్మల్ని తరచూ వేధిస్తుంటాయి. ఉదయాన్నే అల్పాహారాన్ని తినడం మానేస్తే ముఖ్యంగా మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ వ్యాధి ముప్పు పొంచి ఉంటుందని అనేక సర్వేల్లో వెళ్లడైంది. ఉదయాన్నే టిఫిన్ తినే వారితో పోలిస్తే తినని వారిలోనే ఎక్కువగా క్యాన్సర్ వ్యాధి ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మనలో చాలామంది ఉదయం పూట తినడం మానేస్తే బరువు తగ్గవచ్చునని భావిస్తుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. ఉదయాన్నే అల్పాహారం తినడం మానేసిన లేదా సమయానికి తినకపోయినా జీవక్రియలో వ్యత్యాసం ఏర్పడి త్వరగా శరీర బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఉదయాన్నే అల్పాహారాన్ని తినడం మానేస్తే చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చి గుండెపోటు ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఉదయం అల్పాహారం తినని వారిలో చిన్న వయసులోనే బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువట. కావున మీకు ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ లైఫ్ అనుభవిస్తున్న సమయానికి తినడం మాత్రం మర్చిపోవద్దు..