ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్లకు షాకింగ్ న్యూస్.. అలాంటి సమస్యలు వస్తాయట!

sleeping tips for good sleep at night

మనలో చాలామంది ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువ సమయం నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటారు. అయితే వాస్తవం ఏంటంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఎక్కువ సమయం నిద్ర పోవడం వల్ల వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆహారం, నిద్ర మన ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అతిగా నిద్రపోయే వాళ్లను తలనొప్పి సమస్య వేధించే అవకాశం ఉంటుంది. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల న్యూరో ట్రాన్స్‌మీటర్ల పై అదనపు ప్రభావం పడుతుందని తెలుస్తోంది. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల బరువు పెరగడంతో పాటు ఊబకాయం సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువ సమయం నిద్రపోతే డయాబెటిస్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి.

ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వేధించే అవకాశం ఉంటుంది. అతినిద్ర వల్ల డిప్రెషన్ సమస్య వేధిస్తుందని చెప్పవఛు. ఎక్కువ సమయం నిద్ర పోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అతినిద్ర వల్ల రక్త ప్రసరణపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎక్కువ సమయం నిద్రించే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

ఎక్కువ సమయం నిద్రించడం వల్ల తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం లేకపోవడంతో అతినిద్ర అలవాటును దూరం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. నిద్రలేమి, అతినిద్ర రెండూ ఆరోగ్యానికి ప్రమాదకరమేనని చెప్పవచ్చు.