బాదం ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు ఉన్నవాళ్లకు ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది బాదం తినడానికి ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. బాదం ఫైబర్లను సమృద్ధిగా కలిగి ఉండటంతో పాటు బాదాంలో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఖనిజాలు, విటమి‌న్లు ఉంటాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో బాదాం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. హృదయ సంబంధ సమస్యలు మరియు క్యా‌న్సర్‌ నివారణలో బాదాం ఎంతగానో తోడ్పడుతుంది.

మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లు బాదాం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజూ కచ్చితంగా బాదాం తీసుకోవాలని పెద్దలు సైతం చెబుతూ ఉంటారు. బాదం తీసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియాల నుంచి పోరాడే శక్తి సులువుగా శరీరానికి లభించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. బాదం తీసుకోవడం ద్వారా విటమిన్-ఇ, కాల్షియం లభించే అవకాశాలు ఉంటాయి.

ప్రతిరోజూ ఎనిమిది నుంచి పది బాదం పప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. నీటిలో నానబెట్టి బాదం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిది. నానబెట్టిన బాదం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు వేగంగా అందే అవకాశాలు అయితే ఉంటాయి. మోతాదుకు మించి బాదం తీసుకుంటే మాత్రం శరీరంలో కొవ్వులు ఊహించని స్థాయిలో పెరుగుతాయి.

ఎక్కువగా బాదం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉండగా అదే సమయంలో శరీరంలో విషతుల్యాలు పెరిగే అవకాశం కూడా ఉండనుందని తెలుస్తోంది. బాదం తీసుకోవడం వల్ల ఎముకలకు మేలు జరుగుతుంది. బీపీ, కిడ్నీ, ఎసిడిటీ, బరువు సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు బాదంకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.