సగ్గుబియ్యం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

sabudana

సగ్గుబియ్యం గురించి మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా విని ఉంటారు. సగ్గుబియ్యం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అలసట, నీరసం, నిస్సత్తువతో బాధ పడేవాళ్లు ఆ సమస్యల నుంచి దూరం కావాలంటే సగ్గుబియ్యం తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. బరువు తగ్గాలని భావించే వాళ్లు సైతం సగ్గుబియ్యం తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

పండుగల సమయంలో ఎక్కువగా సగ్గుబియ్యంతో వంటకాలను తయారు చేయడం జరుగుతుంది. కర్రపెండలం దుంపతో సగ్గుబియ్యంను తయారు చేస్తారు. దీనిని ఉడకబెట్టి మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగవచ్చు. సగ్గుబియ్యంతో సులువుగా పాయసం కూడా తయారు చేసుకోవచ్చు. కండరాలు, ఎముకలను దృఢంగా చేయడంలో సగ్గుబియ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.

తక్షణ శక్తిని చేకూర్చే విషయంలో సగ్గు బియ్యం తోడ్పడుతుంది. ఉప్మా, కట్ లేట్ గా కూడా సగ్గు బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. అసిడిటీ, అజీర్ణం సమస్యలతో బాధ పడేవాళ్లకు సగ్గుబియ్యం అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న రక్తహీనత సమస్యకుచెక్ పెట్టడంలో సగ్గుబియ్యం తోడ్పడుతుంది. ఇది షుగర్ లెవెల్స్ ను సైతం అదుపులో ఉంచుతుంది.

సగ్గుబియ్యంతో బియ్యం కలిపి తీసుకోవడం ద్వారా శరీరంలో వేడి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తినని వాళ్లు ఆ వంటకాలను డైట్ లో భాగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. సగ్గు బియ్యం మెదడుకు మేలు చేయడంతో పాటు రక్తపోటును నివారిస్తుంది.