ముల్లంగి ఆరోగ్యానికి మంచిదే ఇందులో ఎటువంటి సందేహం లేదు. ముల్లంగిని మన రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ క్యాల్షియం, మెగ్నీషియం ,సోడియం, ఐరన్ వంటి మూలకాలు లభించడంతోపాటు సమృద్ధిగా మన శరీరానికి అవసరమైన అన్ని ప్రోటీన్స్ లభిస్తాయి. ముల్లంగిని తరచూ మన ఆహారంలో తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు గుండె జబ్బులు, మలబద్ధకం, గ్యాస్ట్రిక్, ఉదర క్యాన్సర్, డయాబెటిస్ వంటి ఎన్నో రకాల వ్యాధులను అదుపులో ఉంచవచ్చు.
అయితే ముల్లంగిని తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినే విషయంలో కొంత జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ముల్లంగిని చేదు రుచి కలిగిన ఎటువంటి పదార్థంతోను కలిపి తినకూడదు. ముల్లంగిలో ఉండే సహజ ఔషధ గుణాలు చేదుతో కలిసినప్పుడు గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి అలాగే అనేక శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. ముల్లంగిని తిన్న వెంటనే టీ కాఫీ వంటి పానీయాలను సేవిస్తే మలబద్ధక సమస్యలు తలెత్తుతాయని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కొంతమంది ముల్లంగిని దోసకాయను సలాడ్ లో కలుపుకొని తింటుంటారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. దోసకాయలో ఆస్కార్బెట్ ఎక్కువగా ఉండి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. నారింజ పండ్లను తిన్న వెంటనే ముల్లంగిని ఆహారంగా తీసుకుంటే ఈ రెండిటి కలయిక మన శరీరంలో విషం గా మరి తీవ్ర అనారోగ్యానికి కారణం కావచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో బాధపడే వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముల్లంగి కూర తిన్న వెంటనే పాలు తాగితే మన శరీరంలో యాసిడ్ రిఫ్లక్స్ వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని కడుపులో మంట,తేపులు, గుండెల్లో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ముల్లంగిని ఎక్కువగా తింటే శరీరం డిహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది. కావున ముల్లంగిని ఆహారంగా తిన్నప్పుడు ఎక్కువగా నీరు తాగడం మంచిది.లోబిపి సమస్య ఉన్నవారు ముల్లంగిని ఆహారంగా తినకపోవడమే మంచిది.