పచ్చిమిర్చిని కేవలం ఆహారంలో కారం రుచికి మాత్రమే ఉపయోగిస్తారని చాలామంది అనుకుంటారు. కానీ పచ్చిమిరపకాయలు మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, యాంటీ ఆక్సిడెంట్, అమినో ఆసిడ్స్,కెరోటిన్ తో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. కావున రోజు వారి ఆహారంలో వచ్చి మిరపతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి మిరపకాయలో సమృద్ధిగా ఉండే క్యాప్సైసిన్, కెరోటిన్, క్రిప్టోక్సాంటిన్, లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని చెడు మలినాలను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి దాంతో గుండెపోటు, రక్తపోటు వంటి జబ్బులు అదుపులో ఉంటాయి. అలాగే పచ్చిమిర్చిలో ఉండే పొటాషియం, సీట్రిక్ యాసిడ్ వంటి మూలకాలు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని అరికట్టి హైబీపీ సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది.
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు తరచూ పచ్చిమిర్చిని ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభించే అమైనో ఆమ్లాలు,ఆస్కార్బిక్ ఆమ్లం, ఫైబర్ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయ పడడమే కాకుండా చెడు మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. పచ్చిమిర్చిలో పుష్కలంగా ఉండే కాల్షియం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్, రుమటాయిడ్ వంటి వ్యాధి లక్షణాలను అదుపు చేసి కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
పచ్చి మిరపను రోజువారి ఆహారంగా తీసుకునే వారిలో కంటి సమస్యలు చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ ఎ, విటమిన్ సి కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి కంటి చూపులు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఐరన్ లోపంతో బాధపడేవారు తరచూ పచ్చిమిరపను ఆహారంగా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి అధికం అయ్యి ప్రమాదకర రక్తహీనత సమస్య తొలగిపోతుంది. మిర్చి లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్ చర్మంపై ముడతలను తొలగించి వృద్ధాప్య ఛాయాలను అరికడుతుంది. అల్సర్, ఉబ్బసం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు మోతాదుకు మించి పచ్చిమిరపకాయలను ఆహారంగా తీసుకోరాదు.