మంచం మీద కూర్చుని కాలు ఊపితే ఎలాంటి చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుసా..?

మన హిందూ సంస్కృతిలో సాంప్రదాయాలకు చాలా విశిష్టత ఉంది పూర్వకాలం నుండి మన పెద్దలు సాంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది వాటిని పాటించటం లేదు. సాధారణంగా పైన కూర్చున్నప్పుడు కాళ్లు ఊపితే అలా చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలా పైన కూర్చొని కాళ్ళు ఊపడం వల్ల ఇంటికి దరిద్రం చుట్టుకుంటుందని చెబుతారు. అంతేకాకుండా సంపద దూరం అవుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నిజంగా ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని కాలు ఊపటం వల్ల సంపద దూరం అవుతుందా అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా కొంతమంది ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటారు. అలాంటివారు ఏం చేయాలో తోచక కాళ్ళు ఊపుతూ కూర్చుంటారు. అయితే ఇలా పనీపాటా లేకుండా ఖాళీగా కాళ్లు ఊపుకుంటూ కూర్చోవడం వల్ల ఎటువంటి సంపాదన లేక ఇంట్లో ఉన్న సంపద మొత్తం కరిగిపోతుంది. అందువల్ల ఏదో ఒక పని చేస్తే డబ్బులు వస్తాయి. పని చేయకుండా ఇలా కాళ్లు ఊపుతూ కూర్చుని తింటే కోట్ల ఆస్తులు అయినా కూడా కరిగిపోతాయి . అందుకే కాళ్లు ఊపుతూ కూర్చోవడం వల్ల ఐశ్వర్యం పోతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

ఇలా ఖాళీ గా కూర్చోవడం వలన సంపద కరిగిపోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. దీంతో కుటుంబం పై భారం పడుతుంది. ఎప్పటినుంచో పెద్దవారు ఈ మాటలను చెబుతూ వస్తున్నారు.ఒక వ్యక్తి ఖాళీగా కూర్చుని కాళ్లు ఊపడం వల్ల ఆ కుటుంబానికి మంచిది కాదు అని చెబుతుంటారు. అంతే కాకుండా కాళ్లను ఊపడం వల్ల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.ఊబకాయంతో పాటు మెటబాలిక్ సిండ్రోమ్ , అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, నడుము చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోవడం లాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఖాళీగా పని చేయకుండా కాళ్లు ఊపుతూ కూర్చోవడం వల్ల అనారోగ్య పాలవడంతో పాటు ధన నష్టం కూడా జరుగుతుంది.