ప్రమాదకర పది రకాల వ్యాధులకు చెక్ పెట్టాలంటే? ప్రతిరోజు ఈ దివ్య ఔషధాన్ని సేవించాల్సిందే..!

BEETROOT-1600x900

బీట్రూట్ మనకు ఏడాది పొడవునా మార్కెట్లో లభ్యమవుతూ మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. బీట్రూట్ తో రుచికరమైన సూప్స్, సలాడ్స్, కర్రీస్, ఫ్రై వంటివి చేసుకొని తినడంతో పాటు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ సేవిస్తే మన నిత్య జీవక్రియలకు అవసరమైన విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాల, మరియు ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి.బీట్రూట్ తరచూ ఆహారంలో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం

బీట్రూట్లో ఉండే అతి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం మన శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది మరియు రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు వ్యర్థాలను తొలగించి అవయవాల పనితీరుకు అవసరమైన రక్తాన్ని, ఆక్సిజన్ ను సరఫరా చేయడంలో తోడ్పడుతుంది. దీనికి కారణం బీట్రూట్లో అత్యధికంగా ఐరన్,ఫోలిక్ ఆసిడ్,విటమిన్ బి12,యాంటీ ఆక్సిడెంట్లు,అమైనో ఆమ్లాల సమృద్ధిగా లభించడమే.

మానసిక ఒత్తిడి, అలసట, నీరసం వంటి లక్షణాలతో తరచూ ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ ను సేవిస్తే బీట్రూట్లో సమృద్ధిగా లభించే నైట్రేట్‌లు, విటమిన్ సి, మెగ్నీషియం మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు నాడీ కణ వ్యవస్థను, మెదడు కండరాలను దృఢపరిచి మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపక శక్తిని పెంపొందించడంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు పొటాషియం,నైట్రేట్‌లు అత్యధికంగా లభ్యమయ్యే బీట్రూట్ జ్యూస్ సేవిస్తే అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు. బీట్రూట్లో ఉండే అమినో ఆమ్లాలు ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి ఉబకాయం, ఒబిసిటీ, బిపి, డయాబెటిస్ పంటి వ్యాధుల ముప్పు తగ్గిస్తుంది. మరియు బీట్రూట్లో అత్యధికంగా లభ్యమయ్యే విటమిన్ ఏ, విటమిన్ ఈ చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.