అధిక రక్తపోటును ఎదుర్కోవాలంటే ఈ జ్యూసులు తాగడం తప్పనిసరి!

nm-high-blood-pressure-feature

అధిక రక్తపోటు సమస్యలు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన గుండె పోటు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఇప్పటికైనా మేల్కొని రోజువారి మన ఆహారంలో రక్తపోటు ప్రమాదాన్ని పెంచే ఉప్పు, కారం, మసాలా, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింకును తీసుకోవడం తగ్గించి సంపూర్ణ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన జ్యూసులను మన డైట్ లో చేర్చుకుంటే సహజ పద్ధతిలో హై బీపీ, గుండెపోటు ప్రమాదాలను కంట్రోల్ లో పెట్టవచ్చు.

దానిమ్మ పండులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, అత్యధిక పొటాషియం, మెగ్నీషియం కాల్షియం వంటి ఖనిజ లవణాలు రక్తనాళాలను శుద్ధిచేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి తద్వారా హై బీపీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కావున ప్రతిరోజు దానిమ్మ రసాన్ని సేవించడం మర్చిపోవద్దు. అత్యంత చేదుగా ఉండి కాకర రసంలో విటమిన్ సి, పొటాషియం, సోడియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కావున రక్తనాళాలను శుద్ధిచేసి రక్తపోటు అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

ప్రతిరోజు పాలకూర జ్యూస్ సేవిస్తే ఇందులో ఉండే అత్యధిక పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజు బీట్రూట్ రసాన్ని సేవిస్తే బీట్రూట్ లో నైట్రేట్‌ నిల్వలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేసి రక్తనాళాలను శుద్ధి చేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తద్వారా హై బీపీ సమస్య తొలగించుకోవచ్చు.

సాధారణంగా మనందరికీ అందుబాటులో ఉండే టమోటా జ్యూస్తో రక్తపోటు సమస్యకు పెట్టవచ్చు. టమోటా లో ఉండే విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థం, పొటాషియం, ఫాస్ఫరస్ లు రక్తపోటు ముప్పును తగ్గిస్తాయి. కీర దోస జ్యూస్ రక్తపోటును తగ్గించడంలో ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడింది. ప్రతిరోజు ఉసరి రసాన్ని సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తపోటు ను నియంత్రిస్తుంది.