మధుమేహంతో బాధపడేవారు కరివేపాకు ఇలా తీసుకుంటే మధుమేహానికి చెక్ పెట్టవచ్చు!

సాధారణంగా మనం కరివేపాకును వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం కరివేపాకు వేయటం వల్ల వంట రుచి మాత్రమే వస్తుందని అనుకుంటాం కానీ కరివేపాకు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని విషయం చాలామందికి తెలియదు అందుకే కూరలలో కరివేపాకు కనుక వస్తే వెంటనే దానిని తీసి పక్కన పడేస్తూ ఉంటారు.అయితే బూరెలలో ఉపయోగించే కరివేపాకు వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కనుక ఉన్నాయో తెలిస్తే ఎవరూ కూడా ఇకపై కరివేపాకును తీసి బయటపడేయరు..

కరివేపాకులో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి విటమిన్లు ఖనిజ లవనాలు ఫైబర్ కరివేపాకుల పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని అరికట్టడంలో సహాయపడతాయి. శరీర కణాలను పోషణ అందిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిసాయని ఆరోగ్య నిపుణులుతెలియజేస్తున్నారు అలాగే మధుమేహ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం 10 కరివేపాకులను నమిలి తినడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చు.

ఈ విధంగా మూడు నెలల పాటు కరివేపాకును నమ్మిన తినడం ద్వారా మధుమేహ వ్యాధిని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు.ఇక ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యను తగ్గించి మనం తీసుకున్న ఆహార పదార్థాలు చాలా త్వరగా జీర్ణం అవ్వడానికి ఎంతో దోహదపడతాయి.ఇలా కరివేపాకును తినడం వల్ల కేవలం అనారోగ్య సమస్యలను తరిమికొట్టడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని జుట్టు సౌందర్యాన్ని కూడా పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.