చక్కెర వ్యాధితో బాధపడేవారు వీటిని ఎక్కువగా తింటే ప్రమాదంలో పడినట్టే.. తస్మాత్ జాగ్రత్త!

మన రోజు వారి ఆహారంలో తప్పనిసరిగా ఉల్లిపాయను ఉపయోగిస్తారు. ఉల్లిపాయ మనం తినే ఆహారానికి రుచిని అందించడంతోపాటు మన శరీరానికి అవసరమైన విటమిన్స్ , మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ వంటి సహజ పోషకాలను సమృద్ధిగా అందించడంలో సహాయపడుతుంది. ఎన్నో పోషక విలువలు ఉల్లిపాయలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉల్లిపాయను ఎక్కువగా తింటే ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయను ఎక్కువగా తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఉల్లిపాయలు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభిస్తాయి. అయితే ఉల్లిపాయను మోతాదుకు మించి ఆహారంగా తీసుకుంటే వీటిలో అధికంగా ఉండే గ్లూకోస్, ఫ్రక్టోజ్ వంటివి ఎక్కువగా ఉండి రక్తంలో చక్కెర నిల్వలు అధికమవుతాయి దాంతో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తవచ్చు కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయను తినే విషయంలో తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవాలి. ఉల్లిపాయను అతిగా తినడం వల్ల మన శరీరంలో ప్రోటీన్స్ నిల్వలు అధికం అయ్యి మన వ్యాధి నిరోధక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది.

ఉల్లిపాయలు అత్యధికంగా పీచు పదార్థం, సల్ఫర్ లభిస్తుంది. కావున మోతాదుకు మించి పచ్చి ఉల్లిపాయలను ఆహారంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో వ్యత్యాసం ఏర్పడి కడుపుబ్బరం,ఎసిడిటీ, కడుపులో మంట,గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు.
పచ్చి ఉల్లిపాయను అతిగా తింటే కొందరిలో అలర్జీ సమస్యలు అధికమై తామర,చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలర్జీ సమస్యలు తలెత్తవచ్చు.యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నవారు ఉల్లిపాయను అతిగా తింటే గుండె దడను మరింత పెంచుతుంది. ముఖ్యంగా హార్ట్ సర్జరీ చేయించుకున్న వారు ఉల్లిపాయలను తినే విషయంలో తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవాలి లేదంటే ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చు.