ఎదిగే పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

చిన్నపిల్లల శారీరక మానసిక ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అది మీ కర్తవ్యం కూడా.ముఖ్యంగా పిల్లలకి ఇచ్చే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎదిగే కొద్దీ జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. వాళ్లు మారం చేస్తున్నారు కదా అని ఫాస్ట్ ఫుడ్ ,జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినిపిస్తే పిల్లల శారీరక మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపి పిల్లలు అన్నింట వెనకబడిపోతారు.

సాధారణంగా పిల్లలు ఇంట్లో తిండి తినడానికి మారం చేస్తుంటారు. అలాంటప్పుడు వారికి ఇష్టమైన ఆహారాన్ని చేసి పెట్టి తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు పిల్లలకు తినిపించాలి.పిల్లలు జీర్ణక్రియ రేటు తక్కువగా ఉంటుంది తక్కువ ఆహారాన్ని అందించినప్పుడు ఆహారం త్వరగా జీర్ణం అయ్యి పోషకాలన్ని సమృద్ధిగా పిల్లలకు అందుతాయి.
పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి విటమిన్ సి కలిగిన క్యారెట్, ఆపిల్, అరటి బొప్పాయి పైనాపిల్, కివి వంటి పండ్లను ఆహారంలో భాగం చేయాలి. పండ్లను తినడానికి ఇష్టపడకపోతే వాటిని రుచికరమైన జ్యూస్ రూపంలో అందిస్తే సరిపోతుంది

పిల్లల రోజువారి డైట్ లో అత్యధిక ప్రోటీన్స్, విటమిన్స్, మినిరల్స్ కలిగిన ఉడకబెట్టిన గుడ్డు ను కచ్చితంగా ఉండాలి.పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది పిల్లల ఎముకల పెరుగుదలకు దృఢత్వానికి తోడ్పడుతుంది. కావున పిల్లలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా గోరువెచ్చని పాలను తాగించాలి. అలాగే వెన్న ,నెయ్యి వంటివి ఆహారంలో అలవాటు చేయడం మంచిది. పిల్లలకు స్నాక్స్ రూపంలో చాక్లెట్, బిస్కెట్, పిజ్జా, బర్గర్ వంటివి కాకుండా పిల్లల మానసిక, శారీరక పెరుగుదలకు అవసరమైన క్యాల్షియం,ఐరన్, జింకు, ఫాస్ఫరస్ వంటి మూలకాలు సమృద్ధిగా ఉండే బాదంపప్పు, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ను అదనపు ఆహారంగా ఇవ్వాలి.