తేనేను ఇలా తీసుకుంటున్నారా… అయితే ప్రమాదం బారిన పడినట్లే?

healthy drinks for winter season

ప్రాచీన కాలం నుండి తేనేను మన ఆయుర్వేదంలో కూడా ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నారు. తేనే వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

తేనెలో ఉండే క్యాల్షియం, ఐరన్‌, సోడియం, పొటాషియం వంటి మినరల్స్‌తో పాటు, విటమిన్‌ బి, విటమిన్‌ సి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే.. ఇన్ని పోషక విలువలు ఉన్న తేనెను కొన్ని విధాలుగా తీసుకుంటే విషంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగే వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి చేయడం లేదా బాగా మరుగుతున్న నీటిలో కలపడం వంటివి చేయకూడదు.

అలా చేయడం వల్ల దీని విషంగా మారే ప్రమాదం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల బాగా వేడిగా ఉన్న నీటిలో తేనె కలిపి తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. తేనెను వేడి చేయటం,లేదా అధిక ఉష్ణోగ్రత ఉన్న నీటిలో తేనె తాగడం వల్ల తేనేలో ఉన్న అణువులు విషపూరితంగా మారి జీర్ణవ్యవస్థ పై ప్రభావం చూపుతాయి. దీంతో ఉదర సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల తేనెను తీసుకునేవారు జాగ్రత్తలు పాటిస్తూ అధిక ఉష్ణోగ్రత ఉన్న నీటిలో తేనెను కలపటం లేదా తేనెను వేడి చేసి ఉపయోగించడం వంటి పనులు చేయకుండా జాగ్రత్త వహించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.