మజ్జిగలో వీటిని కలుపుకొని సేవిస్తే మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించే అమృతంలా మారుతుంది!

ప్రతిరోజు ఒక గ్లాసుడు మజ్జిగ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను సులువుగా వదిలించుకోవచ్చు. మజ్జిగలో కొత్తిమీర, పుదీనా , చిటికెడు ఉప్పు, ఉల్లిపాయ లేదా మిరియాలను కలుపుకొని తాగితే ఆ మజానే వేరు కదా. వీటి మిశ్రమంతో కలిసిన మజ్జిగను ప్రతిరోజు తాగితే మన శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ముఖ్యంగా ఈ వేసవి సీజన్ లో ఏవేవో శీతల పానీయాలు తాగడానికి బదులు ఒక గ్లాసుడు మజ్జిగ తాగితే మజ్జిగలో అత్యధికంగా ఉండే ప్రోబయోటిక్స్, విటమిన్ సి, ప్రోటీన్స్, ఖనిజ లవణాలు ఎండ దెబ్బ వల్ల మందగించే జీవ నియంత్రణ కార్యకలాపాలన్నీ తిరిగి పుంజుకుని మనలో డిహైడ్రేషన్ సమస్యను తొలగించి తక్షణ శక్తిని అందిస్తుంది. మరియు మజ్జిగ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది.మజ్జిగలో రైబో ఫ్లోవిన్, విటమిన్ బి12, ఫైబర్ శరీరంలో ఆమ్లా శాతాన్ని తగ్గించి కడుపు మంట, ఉబ్బసం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి లక్షణాలను తొలగిస్తుంది.

ఉబకాయం, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసుడు మజ్జిగ తాగితే చాలా మంచిది.ఒక గ్లాసు మజ్జిగలో 0.5 గ్రాముల సంతృప్త కొవ్వు మాత్రమే ఉంటుంది.హైపర్ కొలేస్టెరోలేమియా సమస్య ఉన్నవాళ్ళు మజ్జిగను నిక్షేపంగా తాగొచ్చు. మరియు శరీర బరువు తగ్గించుకోవాలనుకున్న వారు కూడా రోజువారి డైట్ లో మజ్జిగను చేర్చుకుంటే మంచిది.మజ్జిగలో కాల్షియం, జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది. అందుకే తరచూ మజ్జిగ తీసుకుంటే కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.

అధికంగా మాంసాహారం, స్పైసి ఫుడ్ తిన్నప్పుడు కడుపులో ఆసిడ్ రిఫ్లెక్షన్ వల్ల కడుపులో మంట, గుండెల్లో మంట, అజీర్తి సమస్యలు తలెత్తినప్పుడు ఒక గ్లాసుడు మజ్జిగలోకి నల్ల మిరియాల పొడి వేసుకొని చేయిస్తే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మరియు అల్సర్లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. తరచూ మజ్జిగ తాగే వారిలో మూత్రపిండాల సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది.