హార్ట్ ఎటాక్ రాకుండా ప్రాణాలు కాపాడుకోవాలా.. ఈ ఒక్క పని చేయాల్సిందే!

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతూ ఉండటం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంట్లో గుండె జబ్బుల సమస్యల్తో ఎవరైనా ప్రాణాలు కోల్పోయి ఉన్నా కూడా హెల్త్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత సమస్యల వల్ల మరణాలు పెరుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో గుండె సంబంధిత సమస్యలు లేకపోయినా ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది. షుగర్, బీపీ సమస్యలు చెడు అలవాట్లు లేకపోయినా వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు సైతం ఊహించని స్థాయిలో పెరుగుతాయని గుర్తుంచుకోవాలి.

గుండెకు సంబంధించి హోమోసిస్టిన్ విలువలు ఎక్కువగా ఉంటే వెంటనే ఆంజియోగ్రామ్ వేయించుకుంటే మంచిది. గుండె విషయంలో రిస్క్ ఫ్యాక్టర్స్ ను గుర్తుంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుండెల్లో బ్లాక్స్ ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే స్టంట్స్ వేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. సీటీ స్కాన్ ఆంజియో ద్వారా గుండె సంబంధిత సమస్యలను సులువుగా గుర్తించే అవకాశాలు అయితే ఉంటాయి.

గుండె విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలకు అపాయం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ గుండె సంబంధిత పరీక్షలు చేయించుకుంటూ ఉండటంతో పాటు ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.