అత్యంత ఖరీదైన వెదురు ఉప్పు గురించి మీకు తెలుసా.. ఈ ఉప్పుతో ఇన్ని ప్రయోజనాలా?

మనకు అతి తక్కువ ధరకే ఎక్కువ మొత్తంలో లభ్యమయ్యే వాటిలో ఉప్పు ఒకటి. చాలా ప్రాంతాలలో కిరాణా షాపులు మూసిన సమయంలో కూడా ఉప్పు సంచులు బయట ఉంటాయి. అయితే ఉప్పులో చాలా రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. టేస్టింగ్ ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు కలుగుతాయని తరచూ పదుల సంఖ్యలో కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు ఉండగా ఈ ఉప్పును కొంతమంది బొంగులో ఉప్పు అని మరి కొందరు వెదురు ఉప్పు అని పిలుస్తారు. కొంతమంది ఈ ఉప్పును బొంగులో ఉప్పు అని కూడా పిలుస్తారు. ఈ ఉప్పు కిలో కొనుగోలు చేయాలంటే ఏకంగా 28000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో ఖర్చు చేయాలంటే ఈ ఉప్పు రుచి ఏ విధంగా ఉంటుందో కూడా సులువుగా అర్థం చేసుకోవచ్చు.

ఈ ఉప్పు ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉప్పు వాడటం వల్ల చర్మ, దంత
ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. సముద్రం ఉప్పును వెదురు బొంగులలో నింపి కాల్చి వెదురు ప్రయోజనాలు ఉప్పుకు కూడా ఉండేలా చేస్తారు. మొత్తం 9 సార్లు ఈ ఉప్పు కోసం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఈ ఉప్పును పర్పుల్ సాల్ట్ అని పిలుస్తారు. ఊదారంగులో ఉండే ఈ ఉప్పు ఆరోగ్యానికి మంచిది.

ఆన్ లైన్ ద్వారా కూడా పర్పుల్ సాల్ట్ ను సులువుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉప్పు తయారీకి ఏకంగా 50 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. పచ్చసొన తరహా రుచితో ఉండే ఈ పర్ఫుల్ సాల్ట్ ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజురోజుకు ఈ ఉప్పుకు డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం.