దృష్టిలోపాలను అధిగమించాలంటే మన రోజువారి డైట్ లో ఇది తప్పనిసరి!

మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ రోజుల్లో చాలామంది దృష్టిలోప సమస్యలతో బాధపడుతున్నారు. ఆందోళన చెందాల్సిన విషయమేమిటంటే చిన్న పిల్లల్లో కూడా దృష్టిలోప సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి భవిష్యత్తులో రక్షణ పొందాలంటే రోజువారి డైట్ లో అత్యధిక పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు నిండుగా ఉన్న తోటకూరను ఆహారంగా తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు తెలియజేస్తున్నారు.

పోషకాల గనిగా పిలవబడే తోటకూరను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తోటకూరలు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, యాంటీ ఆక్సిడెంట్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అత్యధిక ప్రోటీన్స్ అత్యల్ప క్యాలరీలు కలిగిన తోటకూరను రోజువారి ఆహారంలో తీసుకుంటే శరీర బరువు నియంత్రించబడడంతోపాటు నిత్య జీవక్రియలకు అవసరమైన శక్తి సామర్థ్యం లభ్యమవుతుంది.

దృష్టిలోపాల నుంచి భవిష్యత్తులో రక్షణ పొందాలనుకున్నవారు మరియు దృష్టిలోప సమస్యలతో బాధపడేవారు రోజువారి డైట్ లో విటమిన్ ఏ, విటమిన్ b6,బీటాకేరోన్,సెలీనియం సమృద్ధిగా కలిగిన తోటకూరను రోజువారి ఆహారంలో తీసుకుంటూనే తోటకూర జ్యూస్ సేవిస్తే కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా కంటి అలర్జీలు, రేచీకటి, కళ్ళ నుంచి నీరు కారణం వంటి దృష్టిలోప సమస్యలన్నీ తొలగిపోతాయి. తోటకూరలు సమృద్ధిగా ఐరన్ లభ్యమవుతుంది కావున రక్తహీనత సమస్య తొలగిపోతుంది. మరియు తోటకూరలో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఎముకలను కండరాలను దృఢంగా ఉంచి కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు సమస్య తొలగిపోతుంది.