మనలో చాలామంది బఠానీలను ఎంతో ఇష్టంగా తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. పచ్చి బఠానీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చలికాలంలో ఇతర కాలాలతో పోల్చి చూస్తే పచ్చి బఠానీలు విరివిగా లభిస్తాయి. వంటకాలలో పచ్చి బఠానీలను ఎక్కువగా వాడతారు. ఈ బఠానీల వల్ల వంటకలకు రుచి పెరుగుతుంది. పచ్చి బఠానీల వల్ల ప్రోటీన్, కాల్షియం, ఐరన్ తో పాటు ఫైబర్, సోడియం, పాస్పరస్, కాల్షియం లభిస్తాయి.
పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన జింక్, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం లభించే ఛాన్స్ అయితే ఉంది. కంటి శుక్లం వంటి వ్యాధుల నుంచి రక్షించడంలో కూడా ఇవి తోడ్పడతాయని చెప్పవచ్చు. పచ్చి బఠానీలలో ఉండే పీచు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఈ బఠానీలలో ఉండే కొమెస్ట్రాల్ క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో తోడ్పడుతుంది.
రక్తంలోని షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. పచ్చి బఠానీలు మెమొరీ పవర్ ను మెరుగుపరిచే విషయంలో ఎంతగానో తోడ్పడతాయి. పచ్చి బఠానీలు తినడం వల్ల శరీరానికి లాభాలే తప్ప నష్టాలు లేవు. పచ్చి బఠానీలను తరచూ తినే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
పచ్చి బఠానీలలో ప్రోటీన్,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి, దీని వల్ల త్వరగా ఆకలి ఉండదు. వాటిలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మీ ఆహారంలో బఠానీలను ఖచ్చితంగా చేర్చుకోండి. మీరు బఠానీలను ఉడకబెట్టడం, కూరగాయలు లేదా సూప్ చేయడం ద్వారా కూడా తీసుకోవచ్చు. అనేక విధాలుగా ఆరోగ్యానికి ప్రోటీన్లు అవసరం. అరకప్పు బఠానీలో 4 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్ మాత్రమే కాదు, బఠానీలలో ఐరన్, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ ఎ, కె , సి కూడా ఉంటాయి. ప్రోటీన్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.