మనలో చాలామంది చిక్కీలను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. మధుమేహం, ఆస్తమా సమస్యలతో బాధ పడే వాళ్లకు చిక్కీలు దివ్యౌషధం అని చెప్పవచ్చు. బెల్లం, నువ్వులు కలిపి తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. శీతల ప్రాంతాల్లో శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవాలని భావించే వాళ్లు చిక్కీలను తినవచ్చు. చిక్కీల తయారీలో బాదం, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు.
కొంతమంది ఈ చిక్కీలను పల్లీ పట్టీ అని కూడా పిలుస్తారు. పల్లీలు, నవ్వులు, డ్రై ఫ్రూట్స్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. బెల్లంతో వీటిని తయారు చేయడం వల్ల పోషకాలు రెట్టింపు కావడంతో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. ప్రతిరోజూ వ్యాయామం చేసేవాళ్లకు ఇవి తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు.
వేరుశనగ విత్తనాలను దోరగా వేయించుకుని ఆ తర్వాత పొట్టు తీసిన పల్లీలను వాడాలి. సగం బెల్లం తీసుకుని తీగపాకం పట్టుకుని వేయించుకున్న గింజలను వేసి నూనె రాసిన పల్లెంలో వాటిని వేసుకోవాలి. ఈ విధంగా చేసిన పల్లీ పట్టీలను తినడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. చలికాలంలో వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
పల్లీల్లో ఉండే సెలీనియం, బెల్లం లో ఉండే మెగ్నీషియం, ఐరన్ కలిసి పునరుత్పత్తి సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడతాయి. హీమోగ్లోబిన్ డెఫిషియెన్సీ ని తగ్గించి ఎనీమియా రాకుండా ప్రొటెక్ట్ చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. వేరు శనగల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. మెటబాలిజంను బూస్ట్ చేయడంలో ఇవి ఉపయోగపడతాయి.
వేరు శనగల్లో ఉండే కాల్షియం ఎముకలు బలం గా ఉండడానికి సహాయం చేస్తుందని చెప్పవచ్చు. వీటిని మితంగా తీసుకోవడం ద్వారా ఈ హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. పరిమితికి మించి వీటిని తీసుకుంటే మలబద్ధకం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. చిక్కీలను ఎక్కువగా తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.