నోటి దుర్వాసన సమస్య మిమ్మల్ని వేధిస్తోందా… ఇలా చేస్తే సమస్య మటుమాయం!

సాధారణంగా చాలామంది నోటి దుర్వాసన సమస్య కారణంగా నలుగురిలో కలవడానికి నలుగురితో నవ్వుతూ మాట్లాడటానికి వెనకడుగు వేస్తారు. ఇలా నోటి దుర్వాసన సమస్యతో ఎంతోమంది బాధపడుతూ నలుగురిలో స్వేచ్ఛగా కలిసి మాట్లాడలేక పోతారు. ఈ విధమైనటువంటి నోటి దుర్వాసన సమస్యను వైద్య పరిభాషలో హ్యలిటోసిస్ అంటారు. నోటిలో తేమ ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. దీంతో నోటి దుర్వాసన సమస్య తలెత్తుతుంది. అలాగే చిగుళ్లకు సంబంధించిన సమస్యలు, నాలుకకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.

ఇలా తరచు నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని పద్ధతులను అనుసరించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రెండుసార్లు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే నోటిని పుక్కిలించడం ఎంతో అవసరం. ఇక భోజనం చేసిన తర్వాత సొంపు లేదా ఏలకులు వంటి సుగంధ ద్రవ్యాలను నమలడం వల్ల నోటి దుర్వాసన రాదు.

వేప, చండ్ర, తుమ్మ వంటి చెట్టు పుల్లలో గానీ పొడితో గానీ దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. దోర జజామకాయను దంతాలతో కొరికి నమిలి తినడం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే త్రిఫల చూర్ణానికి వంటసోడాను కలిపి కషాయంలా చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని నోట్లో పోసుకునిఅలాగే త్రిఫల చూర్ణానికి వంటసోడాను కలిపి కషాయంలా చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలా ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.