శీతాకాలంలో యూరిక్ యాసిడ్ కు చెక్ పెట్టే చిట్కాలివే.. ఈ సమస్యకు సులువుగా చెక్!

సాధారణంగా చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటామనే సంగతి తెలిసిందే. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంది. చలికాలంలో యూరిక్ యాసిడ్ సమస్య వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. యూరిక్ యాసిడ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. మాంసం, చేపలు, రొయ్యలతో పాటూ మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధ పడేవాళ్లలో చాలామందిని మధుమేహం, ఆర్థరైటిస్, గుండె జబ్బుల ప్రమాదం సమస్యలు వేధిస్తాయి.

యూరిక్ ఆసిడ్ పెరగడం వల్ల గుండెలో మంట, అజీర్ణం, వెన్నునొప్పి, విపరీతమైన మంట, శ్వాస సరిగ్గా ఆడకపోవడం లాంటి సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. పప్పు, పనీర్, పాలు, చక్కెర, ఆల్కాహాల్‌, వేయించిన వస్తువులతో పాటూ టమాటాలను ఎక్కవగా తీసుకోకుండా ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య దూరమవుతుంది.

వేప ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మొక్కజొన్న పొట్టును నీటిలో మరిగించి, వడపోసి తాగడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. పొట్లకాయ రసంలో 7 తులసి ఆకులు, 5 ఎండుమిర్చిని కలిపి తాగడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. తులసి, గిలోయ్, వేప, గోధుమ గడ్డి, కలబంద మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.