మెంతి ఆకు కషాయాన్ని సేవిస్తే లాభమా.? నష్టమా.?

మెంతులు మరియు మెంతి ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు మన సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మెంతులను సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు, మెంతి ఆకులను కూరల్లో రుచికి, సువాసన కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. మెంతి ఆకును తరచు కూరల్లోనూ మరియు మెంతి రసాన్ని సేవిస్తే మన శరీరానికి అవసరమైన పోషక విలువలను అందించడంతోపాటు వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, వైరల్, ఇన్ఫెక్షన్ గుణాలు మన శరీరంలో వ్యాధి కారకాలను తొలగించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

మెంతి ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించి ఇన్సులిన్ని ప్రోత్సహిస్తుంది. దాంతో ఇన్సులిన్ బాగా అభివృద్ధి చెంది డయాబెటిస్ వ్యాధిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కావున డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు మెంతి రసాన్ని తీసి అందులో నిమ్మ రసాన్ని కలుపుకొని సేవిస్తే డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చు. పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకులను రసంగా చేసి ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

మెంతి ఆకుల్లో పుష్కలంగా,విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం, ఐరన్, పోలేట్ సమృద్ధిగా లభిస్తుంది. దీనిని నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రమాదకర రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. అలాగే మెంతి ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీన్ని ఆహారంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి జీర్ణాశయ క్యాన్సర్లు తొలుగుతాయి. మెంతి ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలను దరిచేరనీయదు.

మెంతులు మరియు మెంతి ఆకుల్లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని , వెంట్రుకల దృఢత్వాన్ని కాపాడుతుంది. తరచూ కామెర్ల సమస్యతో బాధపడేవారు మెంతి ఆకుల కషాయంలో తేనె కలిపి ప్రతి రోజు సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలసట ఒత్తిడి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు మెంతి ఆకుల రసాన్ని రాత్రి పడుకునే ముందు సేవిస్తే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది.