వేగంగా పెరుగుతున్న బ్లాక్ ఫీవర్ కేసులు.. ఆందోళనలో ప్రజలు..!

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ మధ్యకాలంలో బ్లాక్ ఫీవర్ కేసులు మళ్లీ ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని 11 జిల్లాల్లో 65 బ్లాక్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. అసలు ఈ బ్లాక్ ఫీవర్ వ్యాధికి కారణం ఏంటి? వాటి లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్లాక్ ఫీవర్‌ని కాలా అజర్ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఒక దీర్జకాలిక వ్యాధి. శాండ్‌ఫ్లై అనే కీటకం కాటు ద్వారా శరీరంలోకి చేరే ఈ వ్యాధికి లీష్మానియా అనే పరాన్నజీవి ఈ బ్లాక్ ఫీవర్ కు కారణం. సహజంగా ఆడ సాండ్ -ఫ్లై ఈ వ్యాధిని కలిగిస్తుంది. ఈ సాండ్‌ఫ్లై గోధుమ రంగులో ఉంటుంది. ఈ ప్రత్యేక రకం ఫ్లై మట్టి , అధిక తేమ ఉన్న ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ బ్లాక్ ఫీవర్ బారిన పడినప్పుడు కనిపించే లక్షణాల గురించి తెలుసుకుందాం. బ్లాక్ ఫీవర్ సమస్య వచ్చినప్పుడు దీర్ఘకాలికంగా జ్వరం రావటం, క్రమంగా బరువు తగ్గడం, శరీరం పాలుపోవడం, రక్తహీనత సమస్య, చర్మం పాలిపోయి పొడిగా మరటం, దద్దుర్లు వంటి సమస్యలు కనిపిస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడం, ఈ వ్యాధి సోకినప్పుడు చర్మం బూడిద రంగులో మారుతుంది. దీని ప్రభావం చేతులు, కాళ్లు, పొట్ట, వీపుపై కనిపిస్తుంది. అందుకే దీనికి బ్లాక్ ఫీవర్ అని అంటారు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది.

ముఖ్యంగా ఈ వ్యాధి పోషకాహార లోపంతో బాధ వారికి ఎక్కువగా వస్తుంది. ఇల్లు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా లేకపోవటం, ఇంటి పరిసర ప్రాంతాలలో ఎక్కువ తేమ ఉండటం వల్ల ఈ వ్యాది వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పోషకాహార లోపం, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి ఎక్కువగా వ్యాపిస్తుంది. అందువల్ల ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంటూ మంచి పౌష్ఠికాహారం తీసుకోవాలి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఈ బ్లాక్ ఫీవర్ వ్యాది కల్లోలం సృష్టిస్తోంది. డార్జిలింగ్, మాల్దా, నార్త్ దినాజ్‌పూర్, దక్షిణ్ దినాజ్‌పూర్, కాలింపాంగ్‌లలో కేసులు నమోదయ్యాయి.