తిప్పతీగ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఉపయోగాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

మనలో చాలామంది తిప్పతీగ గురించి ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా వినే ఉంటారు. తిప్పతీగ తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలని భావించే వాళ్లకు తిప్పతీగ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఆయుర్వేద మందుల తయారీలో తిప్పతీగను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందని చెప్పవచ్ఛు.

అన్ని కాలాల్లోనూ తిప్పతీగ మొక్కలు పెరుగుతాయి. తిప్పతీగను జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. తిప్పతీగను సాగు చేసి లక్షల్లో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదనే సంగతి తెలిసిందే. తిప్పతీగ ఆకుల చూర్ణం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జ్వరాలు, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టే విషయంలో తిప్పతీగ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు.

యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గుణాలను కలిగి ఉన్న తిప్పతీగ ఎలాంటి ఆరోగ్య సమస్యను అయినా దూరం చేస్తుంది. అజీర్తి, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో తిప్పతీగ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. తిప్పతీగ చూర్ణం తీసుకోవడం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళన సమస్యలతో పాటు డయాబెటిస్ సమస్య కూడా దూరమవుతుంది.

తిప్పతీగ చూర్ణం వాడటం వల్ల దగ్గు, జలుబు, టాన్సిల్స్ సమస్యలు కూడా సులువుగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తిప్పతీగ చూర్ణం వల్ల కీళ్ల నొప్పులు, విష జ్వరాలు దూరమవుతాయి. వేడిపాలలో తిప్పతీగ పొడిని కలుపుకుని తాగితే చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.