మీ మూత్రం రంగు ఆరోగ్య సమస్యలను సూచిస్తుందా.. ఈ తప్పులు మాత్రం చేయొద్దంటూ?

మన ఆరోగ్య సమస్యలను మూత్రం ద్వారా గుర్తించవచ్చా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది. యూరిన్ రంగు ఎన్నో ఆరోగ్య సమస్యలను సూచించడంతో పాటు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుంది. ఏవైనా వ్యాధులు వస్తే డాక్టర్లు మొదట మూత్ర పరీక్ష చేయించుకోవాలని సూచించడానికి కూడా ఇదే ముఖ్య కారణమని చెప్పవచ్చు. శరీరంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు సులువుగా పంపించవచ్చు.

తాగే నీటి ఆధారంగా కూడా మూత్రం రంగు మారే అవకాశం ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధ పడే వాళ్లలో మూత్రం ఊదా రంగులో ఉంటుందని చెప్పవచ్చు. కిడ్నీ వ్యాధులు, కాలేయ వ్యాధులతో బాధ పడేవాళ్లలో సైతం మూత్రం రంగు మారుతుందని చెప్పవచ్చు. మూత్రం నీళ్లలా వస్తుందంటే సాధారణంగా కంటే అతిగా నీళ్లు తాగుతున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

మూత్రం లేత పసుపు రంగులో ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు తాగుతున్నాడని అర్థం చేసుకోవాలి. ఎలాంటి రంగు లేకుండా మూత్రం వస్తుందంటే అవసరానికి మించి నీళ్లు తాగుతున్నాడని భావించాలి. మూత్రపిండాల్లో రాళ్లు లేదా క్యాన్సర్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం మూత్రంలో రక్తం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మాత్రం శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మూత్రం రంగు ముదురు గోధుమ రంగులో ఉందంటే డిహైడ్రేషన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాల మూత్ర క్యాథెటర్ వాడకం కారణమయ్యే ఛాన్స్ ఉంది.