ప్రతిరోజు ఈ చిన్న పొరపాట్లు చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు!

ప్రతిరోజు పాలు తాగే వారిలో పౌష్టికాహార లోపం తొలగిపోయి శారీరక దృఢత్వం, మానసిక సామర్థ్యం పెంపొందించబడుతుంది. ముఖ్యంగా పాలల్లో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే . అయితే చాలామంది వారికి తెలియకుండానే పాలు తాగే విషయంలో కొన్ని పొరపాట్లను చేస్తుంటారు ఫలితంగా తరచూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న నిపుణుల సూచనల ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను పాలతో కలిపి అస్సలు తీసుకోకూడదు అవేంటో ఇప్పుడు చూద్దాం.

 

పాలల్లో తేనె,నిమ్మరసాన్ని కలుపుకొని సేవిస్తే మన ఆరోగ్యం పై వ్యతిరేక చర్య జరిగి దగ్గు, జలుబు గుండెల్లో మంట వంటి లక్షణాలతో బాధపడాల్సి వస్తుంది. చాలామంది పాలల్లో బేకన్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇలా తీసుకోవడం వల్ల కొందరిలో శరీరం వాపుకి కారణం అవుతుంది. పాలల్లో అత్యధికంగా విటమిన్ సి, ప్రోటీన్స్ లభ్యమవుతాయి కావున పాలు తాగిన వెంటనే విటమిన్ సి మరియు ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి

 

చేపలను తిన్న వెంటనే పాలను తాగితే కొందరిలో తీవ్రమైన చర్మ సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా చర్మంపై తెల్లటి మచ్చలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు తో కలిపి పాలు,పెరుగు వంటి పదార్థాలను తీసుకుంటే జీర్ణం అవడంలో ఆలస్యం జరిగి అజీర్తి, గ్యాస్టిక్, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయను తిన్న వెంటనే పాలు తాగితే వాంతులు విరేచనాల సమస్య తలెత్తవచ్చు. ముల్లంగి తో చేసిన ఆహార పదార్థాలతో కలిపి పాలు తాగితే జీర్ణ వ్యవస్థలో లోపాలు తలెత్తుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కావున పాలు తాగిన వెంటనే ఇప్పుడు సూచించిన ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడమే మంచిది . తినాలనిపిస్తే రెండు లేదా మూడు గంటల తర్వాత తీసుకుంటే సరిపోతుంది.